Sri Vaibhava Lakshmi Vratham in telugu
Sri Vaibhava Lakshmi Vratham in telugu

Sri Vaibhava Lakshmi Vratham in telugu

Sri Vaibhava Lakshmi Vratham in telugu

images 24
Sri Vaibhava Lakshmi Vratham in telugu

🪔 శ్రీ వైభవ లక్ష్మీ వ్రతం తెలుగు వివరణ:

శ్రీ వైభవ లక్ష్మీ వ్రతం అనేది భగవతీ లక్ష్మీదేవికి అర్పించబడే పవిత్రమైన వ్రతము. ఈ వ్రతాన్ని సాధారణంగా శుక్రవారం రోజున 7 వారాలు లేదా 11 వారాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ వ్రతంలో లక్ష్మీదేవిని వైభవ రూపంలో పూజించడం ద్వారా, కుటుంబంలో ఐశ్వర్యం, శాంతి, ఆరోగ్యం, మరియు సుఖసంతోషాలు లభిస్తాయనే విశ్వాసం ఉంది.

ఈ వ్రతాన్ని పురుషులు మరియు మహిళలు ఇద్దరూ ఆచరించవచ్చు. పూజా విధానంలో వైభవ లక్ష్మీ కథా శ్రవణం, దీపారాధన, నైవేద్యం, మరియు చివరగా ఉపవాస వ్రతం లేదా ప్రసాద వినియోగం ఉంటాయి.

వైభవ లక్ష్మీ వ్రతంలో ముఖ్య అంశాలు:

  • లక్ష్మీదేవికి శోభాయమానమైన పూజ
  • ప్రతి శుక్రవారం ఒక కథ పారాయణ
  • వ్రతం పూర్తయ్యే 7వ లేదా 11వ శుక్రవారం ఉత్సవంగా పూజ
  • పూజ అనంతరం స్త్రీలకు తాంబూలం, ప్రసాదం పంపిణీ

ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల గృహంలో దారిద్య్రం తొలగి, సంపద, ధన ధాన్యాలు, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని శ్రద్ధాభక్తులతో నమ్ముతారు.

వైభవ లక్ష్మీ వ్రతంలో ముఖ్య అంశాలు:

  • లక్ష్మీదేవికి శోభాయమానమైన పూజ
  • ప్రతి శుక్రవారం ఒక కథ పారాయణ
  • వ్రతం పూర్తయ్యే 7వ లేదా 11వ శుక్రవారం ఉత్సవంగా పూజ
  • పూజ అనంతరం స్త్రీలకు తాంబూలం, ప్రసాదం పంపిణీ

ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల గృహంలో దారిద్య్రం తొలగి, సంపద, ధన ధాన్యాలు, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని శ్రద్ధాభక్తులతో నమ్ముతారు.

గమనిక: ముందుగా పూర్వాంగం, పసుపు గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం ఆచరించవలెను.)

పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధపురుషార్థ ఫలసిద్ధ్యర్థం అఖండిత సర్వవిధ సుఖసౌభాగ్య ప్రాప్త్యర్థం శ్రీవైభవలక్ష్మీ దేవతాముద్దిశ్య శ్రీవైభవలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం శ్రీసూక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||

ప్రాణప్రతిష్ఠా –
ఓం అసు॑నీతే॒ పున॑ర॒స్మాసు॒ చక్షు॒:
పున॑: ప్రా॒ణమి॒హ నో” ధేహి॒ భోగ”మ్ |
జ్యోక్ప॑శ్యేమ॒ సూర్య॑ము॒చ్చర”న్త॒
మను॑మతే మృ॒డయా” నః స్వ॒స్తి ||
అ॒మృత॒o వై ప్రా॒ణా అ॒మృత॒మాప॑:
ప్రా॒ణానే॒వ య॑థాస్థా॒నముప॑హ్వయతే ||
ఆవాహితో భవ స్థాపితో భవ |
సుప్రసన్నో భవ వరదో భవ |

అస్మిన్ కలశే శ్రీవైభవలక్ష్మీ దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి |

ధ్యానం –
ల॒క్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీ॒రంగధామే॑శ్వరీమ్ |
దా॒సీభూతసమస్త దేవ వ॒నితాం లో॒కైక॒ దీపా॑oకురామ్ |
శ్రీమన్మన్దకటాక్షలబ్ధ విభవ బ్ర॒హ్మేన్ద్రగఙ్గా॑ధరాం |
త్వాం త్రై॒లోక్య॒ కుటు॑oబినీం స॒రసిజాం వ॒న్దే ముకు॑న్దప్రియామ్ ||
పద్మాక్షీం వరపద్మశోభితకరౌ పద్మాసనస్థాం శుభామ్ |
శ్రీదేవీం ప్రణతోఽస్మి సంతతమహం ప్రారబ్ధదోషాపహమ్ ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః ధ్యాయామి |

ఆవాహనం –
హిర॑ణ్యవర్ణా॒o హరి॑ణీం సు॒వర్ణ॑రజ॒తస్ర॑జామ్ |
చ॒న్ద్రాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒ ఆవ॑హ ||
సర్వసంపత్ప్రదాత్రీ చ మహాలక్ష్మీమహం భజే |
ఆవాహయామ్యహం లక్ష్మీం సర్వసౌఖ్యప్రదాయినీమ్ ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః ఆవాహయామి |

ఆసనం –
తాం మ॒ ఆవ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీ”మ్ |
యస్యా॒o హిర॑ణ్యం వి॒న్దేయ॒o గామశ్వ॒o పురు॑షాన॒హమ్ ||
సూర్యాయుతనిభస్ఫూర్తే స్ఫురద్రత్నవిభూషితే |
సింహాసనమిదం దేవి గృహాణ సురవందితే ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః రత్నసింహాసనం సమర్పయామి |

పాద్యం –
అ॒శ్వ॒పూ॒ర్వాం ర॑థమ॒ధ్యాం హ॒స్తినా॑దప్ర॒బోధి॑నీమ్ |
శ్రియ॑o దే॒వీముప॑హ్వయే॒ శ్రీర్మా॑దే॒వీర్జు॑షతామ్ ||
గంగాది సర్వతీర్థేభ్యో మయా ప్రార్థనయాహృదమ్ |
తోయం ఏతత్ సుఖస్పర్శం పాద్యార్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి |

అర్ఘ్యం –
కా॒o సో”స్మి॒తాం హిర॑ణ్యప్రా॒కారా॑మా॒ర్ద్రాం
జ్వల॑న్తీం తృ॒ప్తాం త॒ర్పయ॑న్తీమ్ |
ప॒ద్మే॒ స్థి॒తాం ప॒ద్మవ॑ర్ణా॒o తామి॒హోప॑హ్వయే॒ శ్రియమ్ ||
అష్టగంధసమాయుక్తం స్వర్ణపాత్రప్రపూరితమ్ |
అర్ఘ్యం గృహాణ మద్దత్తం మహాలక్ష్మి నమోఽస్తు తే ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |

ఆచమనీయం –
చ॒న్ద్రాం ప్ర॑భా॒సాం య॒శసా॒ జ్వల॑న్తీ॒o
శ్రియ॑o లో॒కే దే॒వజు॑ష్టాముదా॒రామ్ |
తాం ప॒ద్మినీ॑మీ॒o శర॑ణమ॒హం ప్రప॑ద్యే-
-ఽల॒క్ష్మీర్మే॑ నశ్యతా॒o త్వాం వృ॑ణే ||
కర్పూరేణ సుగంధేన సురభిస్వాదుశీతలమ్ |
తోయం ఆచమనీయార్థం దేవి త్వం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |

మధుపర్కం –
మధుపర్కం మయా దేవి కాంచీనూపురశోభితే |
స్వీకృత్య దయయా దేవి కురుమహం తు మంగళమ్ ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః మధుపర్కం సమర్పయామి |

పంచామృత స్నానం –
పంచామృతమిదం దివ్యం పంచపాతకనాశనమ్ |
పంచభూతాత్మికే దేవి పాహి స్వీకృత్య శంకరి ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః పంచామృత స్నానం సమర్పయామి |

శుద్ధోదక స్నానం –
ఆ॒ది॒త్యవ॑ర్ణే॒ తప॒సోఽధి॑జా॒తో వన॒స్పతి॒స్తవ॑ వృ॒క్షోఽథ బి॒ల్వః |
తస్య॒ ఫలా॑ని॒ తప॒సా ను॑దన్తు మా॒యాన్త॑రా॒యాశ్చ॑ బా॒హ్యా అ॑ల॒క్ష్మీః ||
గంగా యమునయోస్తోయైః ఆనీతం నిర్మలం శుభమ్ |
శీతోత్థగమితం దేవి స్నానార్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః శుద్ధోదకస్నానం సమర్పయామి |

వస్త్రయుగ్మం –
ఉపై॑తు॒ మాం దే॑వస॒ఖః కీ॒ర్తిశ్చ॒ మణి॑నా స॒హ |
ప్రా॒దు॒ర్భూ॒తోఽస్మి॑ రాష్ట్రే॒ఽస్మిన్ కీ॒ర్తిమృ॑ద్ధిం ద॒దాతు॑ మే ||
సర్వభూషాత్మికే సౌమ్యే లోకలజ్జానివారణి |
వాససి ప్రతిగృహ్యేతాం మయా తుభ్యం సమర్పితే ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

యజ్ఞోపవీతం –
క్షుత్పి॑పా॒సామ॑లాం జ్యే॒ష్ఠామ॑ల॒క్ష్మీం నా॑శయా॒మ్యహమ్ |
అభూ॑తి॒మస॑మృద్ధి॒o చ సర్వా॒o నిర్ణు॑ద మే॒ గృహా॑త్ ||
ఉపవీతం మయా ప్రీత్యా కాంచనేన వినిర్మితమ్ |
గృహీత్వ త్వయి భక్తిం మే ప్రయచ్ఛ కరుణానిధే ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి |

గంధం –
గ॒oధ॒ద్వా॒రాం దు॑రాధ॒ర్షా॒o ని॒త్యపు॑ష్టాం కరీ॒షిణీ”మ్ |
ఈ॒శ్వరీ॑గ్ం సర్వ॑భూతా॒నా॒o తామి॒హోప॑హ్వయే॒ శ్రియమ్ ||
శ్రీకంఠ చందనం దివ్యం గంధాడ్యం సుమనోహరమ్ |
విలేపనం సురశ్రేష్ఠే ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః గంధాన్ ధారయామి |
గంధస్యోపరి హరిద్రాకుంకుమం ధారయామి |

మంగళసూత్రం –
మాంగళ్యం మణిసంయుక్తం ముక్తావిద్రుమ సంయుతమ్ |
దత్తం మంగళసూత్రం చ గృహాణ హరివల్లభే ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః మంగళసూత్రం సమర్పయామి |

ఆభరణం –
మన॑స॒: కామ॒మాకూ॑తిం వా॒చః స॒త్యమ॑శీమహి |
ప॒శూ॒నాం రూ॒పమన్న॑స్య॒ మయి॒ శ్రీః శ్ర॑యతా॒o యశ॑: ||
రత్న కంకణ వైడూర్యం ముక్తా హారాదికాని చ |
సుప్రసన్నేన మనసా దత్తాని త్వం గృహాణ మే ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః ఆభరణాని సమర్పయామి

అక్షతాన్ –
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శూభాన్ |
హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః అక్షతాన్ సమర్పయామి |

పుష్పం –
క॒ర్దమే॑న ప్ర॑జాభూ॒తా॒ మ॒యి॒ సంభ॑వ క॒ర్దమ |
శ్రియ॑o వా॒సయ॑ మే కు॒లే మా॒తర॑o పద్మ॒మాలి॑నీమ్ ||
జాతీ చంపక పున్నాగ కేతకీ వకుళాని చ |
మయాఽర్పితాని సుభగే గృహాణ జగదంబికే ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః పుష్పాణి సమర్పయామి |

అథాంగ పూజా –
ఓం చపలాయై నమః – పాదౌ పూజయామి |
ఓం చంచలాయై నమః – జానునీ పూజయామి |
ఓం కమలాయై నమః – కటిం పూజయామి |
ఓం కాత్యాయన్యై నమః – నాభిం పూజయామి |
ఓం జగన్మాత్రే నమః – జఠరం పూజయామి |
ఓం విష్ణువల్లభాయై నమః – వక్షః పూజయామి |
ఓం కమలవాసిన్యై నమః – భుజద్వయం పూజయామి |
ఓం పద్మనిలయాయై నమః – ముఖం పూజయామి |
ఓం కమలపత్రాక్ష్యై నమః – నేత్రద్వయం పూజయామి |
ఓం శ్రియై నమః – శిరః పూజయామి |
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః – సర్వాణ్యంగాని పూజయామి |

అథ అష్టోత్తరశతనామ పూజా –

శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః చూ |

శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామావళిః చూ |

శ్రీవైభవలక్ష్మీ దేవతాయై నమః అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి |

ధూపం –
ఆప॑: సృ॒జన్తు॑ స్ని॒గ్ధా॒ని॒ చి॒క్లీ॒త వ॑స మే॒ గృహే |
ని చ॑ దే॒వీం మా॒తర॒o శ్రియ॑o వా॒సయ॑ మే కు॒లే ||
వనస్పతి రసోత్పన్న సుగంధేన సమన్వితమ్ |
దేవీ ప్రీతికరో నిత్యం ధూపోఽయం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః ధూపమాఘ్రాపయామి |

దీపం –
ఆ॒ర్ద్రాం పు॒ష్కరి॑ణీం పు॒ష్టి॒o పి॒ఙ్గ॒లాం ప॑ద్మమా॒లినీమ్|
చ॒న్ద్రాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒ ఆవ॑హ ||
కార్పాసవర్తి సంయుక్తం ఘృతయుక్తం మనోహరమ్ |
తమో నాశకరం దీపం గృహాణ పరమేశ్వరి ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః దీపం దర్శయామి |
ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి |

నైవేద్యం –
ఆ॒ర్ద్రాం య॒: కరి॑ణీం య॒ష్టి॒o సు॒వ॒ర్ణాం హే॑మమా॒లినీమ్ |
సూ॒ర్యాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీ॒o జాత॑వేదో మ॒ ఆవహ ||
బహుభక్ష్య సమాయుక్తం నానాఫల సమన్వితమ్ |
నైవేద్యం గృహ్యతాం దేవి నారాయణకుటుంబినీ ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః నైవేద్యం సమర్పయామి |

ఓం భూర్భువ॒స్సువ॑: | తత్స॑వి॒తుర్వరే”ణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి | ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి |
(సాయంకాలే – ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” | ఓం వ్యా॒నాయ॒ స్వాహా” |
ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” | ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి |
ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి | శుద్ధాచమనీయం సమర్పయామి ||

తాంబూలం –
తాం మ॒ ఆవ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీ”మ్ |
యస్యా॒o హి॑రణ్య॒o ప్రభూ॑త॒o గావో॑ దా॒స్యోఽశ్వా”న్వి॒న్దేయ॒o పురు॑షాన॒హమ్ ||
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతమ్ |
ఏలాలవంగ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః తంబూలం సమర్పయామి |

నీరాజనం –
స॒మ్రాజ॑o చ వి॒రాజ॑o చాభి॒శ్రీర్యా చ॑ నో గృ॒హే |
ల॒క్ష్మీ రా॒ష్ట్రస్య॒ యా ముఖే॒ తయా॑ మా॒ సగ్ం సృ॒జామసి |
నీరాజనం నీరజాక్షి నారాయణవిలాసినీ |
గృహ్యతాం అర్పితం భక్త్యా గరుడధ్వజ భామిని ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః నీరాజనం సమర్పయామి |
నీరాజనంతరం శుద్ధాచమనీయం సమర్పయామి |

మంత్రపుష్పం –
పద్మప్రియే పద్మిని పద్మ॒హస్తే ప॑ద్మాలయే పద్మదళాయతాక్షి |
వి॒శ్వ॒ప్రియే॑ విష్ణు మనో॑ఽనుకూలే॒ త్వత్పా॑దప॒ద్మం మయి॒ సన్ని॑ధత్స్వ ||
యా॒ సా॒ పద్మా॑సన॒స్థా॑ విపులకటితటీ॑ ప॒ద్మపత్రా॑యతా॒క్షీ |
గంభీరా వ॒ర్తనాభిః స్తనభర నమితా శుభ్ర వ॒స్త్రోత్తరీ॑యా |
లక్ష్మీర్ది॒వ్యై॑ర్గజేన్ద్రైర్మ॒ణిగణ ఖచితైః స్నాపితా హే॑మకు॒మ్భైః |
ని॒త్యం సా॑ పద్మహస్తా మమ వస॑తు గృ॒హే సర్వమా॒ఙ్గల్య॑యుక్తా ||
ల॒క్ష్మీ॒o క్షీ॑రసముద్రరాజతనయాం శ్రీ॒రంగధామే॒శ్వరీ॑o
దా॒సీభూతసమస్త దేవ వ॒నితాం లో॒కైక॒ దీపా॑oకురామ్ |
శ్రీ॒మన్మ॑న్దకటాక్షలబ్ధ విభవ బ్ర॒హ్మేన్ద్రగఙ్గా॑ధరాం
త్వా॒o త్రై॒లోక్య॒ కుటు॑oబినీం స॒రసిజాం వ॒న్దే ముకు॑న్దప్రియామ్ ||
సిద్ధల॒క్ష్మీర్మో॑క్షల॒క్ష్మీ॒ర్జ॒యల॑క్ష్మీః స॒రస్వ॑తీ |
శ్రీలక్ష్మీర్వ॑రల॒క్ష్మీ॒శ్చ॒ ప్ర॒సన్నా॒ మ॑మ స॒ర్వదా ||
ఓం మ॒హా॒దే॒వ్యై చ॑ వి॒ద్మహే॑ విష్ణుప॒త్న్యై చ॑ ధీమహి |
తన్నో॑ లక్ష్మీః ప్రచో॒దయా”త్ ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః మంత్రపుష్పం సమర్పయామి |

ఆత్మప్రదక్షణ –
యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |
త్రాహిమాం కృపయా దేవీ శరణాగతవత్సలే |
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష మాం పరమేశ్వరి |
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి .

సర్వోపచారాః –
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః ఛత్రం ఆచ్ఛాదయామి |
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః చామరైర్వీజయామి |
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః నృత్యం దర్శయామి |
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః గీతం శ్రావయామి |
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః ఆందోళికాన్ ఆరోహయామి |
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః అశ్వానారోహయామి |
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః గజానారోహయామి |
సమస్త రాజ్ఞీయోపచారాన్ దేవ్యోపచారాన్ సమర్పయామి |

ప్రార్థనా –
పద్మాంగీ పద్మజా పద్మా పద్మేశీ పద్మవాసినీ |
పద్మపత్రవిశాలాక్షీ పాతు మాం శ్రీరమా సదా ||
దేవేశీ భక్తసులభే సర్వాభీష్టప్రదాయినీ |
త్రాహి మాం సతతం దేవీ ప్రసీద వరదో భవ ||
శ్రియం దేహి సుఖం దేహి సౌభాగ్యం సంతతిం ముదా |
దేహి మే నిత్యకళ్యాణి శరణాగతవత్సలే ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి |

వాయనదాన మంత్రం –
శ్రీదేవీ లోకకళ్యాణి పద్మాక్షీ సర్వమంగళా |
సువాసినీభ్యో దాస్యామి వాయనేన ప్రసీదతు ||

శ్రీ వైభవలక్ష్మీ వ్రతకథా ప్రారంభః –

పూర్వము కైలాసమున పార్వతీ దేవి, పరమేశ్వరునితో ప్రియభాషణములు ఆడుచూ, “ప్రాణనాథా, భూలోకమున జనులందరు ధనార్జన కొరకు మిక్కిలి కష్టములను అనుభవించుచున్నారు. అయినను, కొద్దిమంది మాత్రమే ఐశ్వర్యవంతులగుటకు కారణమేమి”, యని అడుగగా, సర్వేశ్వరుడు చిరునవ్వునవ్వి, “దేవీ, సర్వము వైభవలక్ష్మీ దయవలననే ఉండును. సమస్త సిరిసంపదలకు ఆ తల్లియే దేవత. కావున ఈ సత్యమును గుర్తించి ఎవరైతే ఆ ఐశ్వర్యలక్ష్మిని భక్తిశ్రద్ధలతో ఆరాధింతురో, వారిపట్ల ఆ తల్లి అపార కృపాకటాక్షములు కలిగి అఖండ వైభవమును అనుభవింపగలరు. ధనమును తృణీకరించిన సంపదలు కలుగజాలవు”, అని చెప్పెను. ఇది వినిన పార్వతీ దేవి, ఈ వైభవలక్ష్మి గురించి నాకు మరింత చెప్పవలసినది అని ప్రార్థింప ఆ పరమేశ్వరుడిట్లు పలికె.

ఒకానొకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తిని గూర్చి తపస్సు చేయుచుండ, ఆ భక్తికి మెచ్చిన ఆ పరాశక్తి ప్రత్యక్షమై ఏమి కావలెనో కోరుకోయని చెప్పగా, భృగు మహర్షి “తల్లీ, వైభవకరమగు నీ రూపముతో నా కుమార్తెగా జన్మించి నన్ననుగ్రహింపవలసినది” యని ప్రార్థింప ఆ పరాశక్తి ఆతని భక్తిశ్రద్ధలకు మెచ్చి, “తథాస్తు” అని వరమిచ్చి అంతర్ధానమాయెను. తత్ఫలముగా పరాశక్తియొక్క సంపత్కర అంశ భృగు మహర్షియొక్క కుమార్తె వలె అవతరించినది. పుత్రికా వాత్సల్యముతో ముదమొందిన భృగువు ఆమెను శ్రీమహావిష్ణువునకు ఇచ్చి వివాహము చేసెను. ఆ శ్రీహరి ఆనతిమేర దేవతలందరకు వైభవమును ప్రసాదించి, వైకుంఠలక్ష్మిగా ఆరాధింపబడుతూ ఉండెను.

ఇట్లుండ భూలోకమున ఋషులందరు మహాయాగము చేయదలచి, హవిస్సును ఎవరకు ఇవ్వవలసినదో నిర్ణయింపుమని భృగు మహర్షిని వేడుకొనగా భృగువు సమ్మతించి ముల్లోకములకు పయనమాయెను. బ్రహ్మలోకమున సరస్వతితో ప్రియభాషణములాడు బ్రహ్మదేవులవారిని చూచి, తన రాకను గౌరవింపలేదని కోపగించుకుని, కైలాసమునకు యేగెను. అచటకూడా మహేశ్వరుడు ధ్యానమగ్నుడగుటచే భృగువు రాకను గమనించలేదు. మరింత కోపముతో భృగువు అక్కడ నుండి వెడలిపోయెను. చివరకు వైకుంఠము చేరగా అచట విశ్రాంతి తీసుకొనుచున్న శ్రీమహావిష్ణువును చూచి తన రాకను గౌరవింపలేదని పట్టరానికోపమునొంది, ఆ విష్ణువు వక్షఃస్థలముపై కాలితో తన్నెను. అంతయా విష్ణువు భృగువు యొక్క కోపమును శాంతపరచి పంపివేసెను. ఇది గమనించిన శ్రీమహాలక్ష్మి, తన నివాసస్థానమగు తన భర్త వక్షఃస్థలమును కాలితో తన్నినను యేమియును అనలేదని ఆగ్రహముతో వైకుంఠమువదలి క్షీరసాగరములోనికి వెడలిపోయెను. దీనితో ఇంద్రాది దేవతలందరి వైభవము క్షీణించెను. వారందరు శ్రీమహావిష్ణువు వద్దకు పోయి వేడుకొనగా, క్షీరసాగరమథనము చేయమని ఆనతిచ్చెను. మంథరపర్వతముతో మథనము చేయు సమయమున, ఆ శ్రీమహాలక్ష్మి వారిని అనుగ్రహింప తలచి, అమృతముతో పాటుగా అష్టలక్ష్మీరూపములతో వారికి వైభవమును ప్రసాదించి, తిరిగి తన ప్రాణవల్లభుడగు శ్రీమహావిష్ణువు వద్దకు చేరెను. కావున శ్రీమహాలక్ష్మికి ఇష్టమైన శ్రీమహావిష్ణువును తిరస్కరించిన ఆ యమ్మ నిలువజాలదని గ్రహింపుము.

అటులనే మానవులకు పూర్వజన్మ కర్మల వలన కూడా సిరిసంపదలు సంభవించును. ఇందుకు ఉదాహరణగా సుశర్మ గురించి చెప్పెద వినుము. ఒకానొక గ్రామమున సుశర్మయను సకలశాస్త్రకోవిదుడు కలడు. తన గురుకుల ఆశ్రమము ద్వారా పురప్రజలకు, రాజులకు, ధనవంతులకు శాస్త్రవిద్యను అభ్యసింపజేయుచూ ఉండెను. కాని ఆతని ఇంట పేదరికము ఉండెను. ఇది గమనించిన సుశర్మ భార్యయగు సుశాంత ఇట్లు పలికెను. “నాథా, మీరు విద్యను ప్రసాదించిన మీ శిష్యులలో కొందరు ధనవంతులు ఉన్నారు. మన ఇంటి వెచ్చములకొరకు వారివద్దకు పోయి కొంతధనము తీసుకురావలసినది” అని పలుకగా, సుశర్మ “యాచన చేయుట భావ్యము కాదు, పైగా సిరిసంపదలమీద ఆశ కలిగియుండుట మంచిదికాదు. అయినను మనకు కావలసిన సంపదలు ఆ వైభవ స్వరూపమగు శ్రీమహాలక్ష్మి ఇవ్వగలదుగాన ఆ యమ్మను గూర్చి యాగము చేసెద”నని చెప్పి యాగము చేయసాగెను. సుశర్మ చేసిన యాగమునకు సంతుష్టురాలైన శ్రీమహాలక్ష్మి ప్రత్యక్షమై “నేటి రాత్రి నీ యింట బంగారు కాసుల వర్షము కురిపించెద”నని వరమిచ్చి అంతర్ధానమాయెను. సుశర్మ ఆనందముగా ఈ విషయము సుశాంతకు తెలిపి రాత్రంతా జాగారము చేయుచూ వేచిచూచెను. అలా చూస్తూ ఉండగా తెల్లవారినది. సంపదవర్షం రాలేదని గ్రహించిన సుశర్మ, భార్యను పేదరికములో ఉంచినందుకు మిక్కిలి దుఃఖమునొంది ప్రాయోపవేశము చేయదలచి ఇంటినుండి బయలుదేరెను. ఇంటి బయట మలిన వస్త్రములతో, కాంతిహీనమైన ఒక స్త్రీ కనిపించినది. సుశర్మ నీవెవరని అడుగగా ఆ స్త్రీ ఇట్లు పలికెను. “నీ యాగమునకు మెచ్చి నీ యింట కనకవర్షము కురిపించ నే వచ్చితిని. కానీ నీ యింట గల జ్యేష్ఠాదేవి నన్నువారించెను. నీ పూర్వజన్మలలో పుణ్యకార్యములు, దాన ధర్మములు చేయని కారణమున, ఈ జన్మమున నీకు సంపద కలుగకయున్నదని తెలిపినది.” ఇది వినిన సుశర్మ, తను లేకపోయిన తన భార్యా బిడ్డలకు సంపదలు కలుగగలవని గ్రహించి, సన్యాసాశ్రమము స్వీకరించెను. ప్రతిగా కరుణించమని శ్రీమహాలక్ష్మిని ప్రార్థింపగా, ఆతని భక్తియుక్తులకు సంతోషమునొంది శ్రీవైభవలక్ష్మి ఆ యింట వైభవములను కటాక్షించెను.

ఓ పార్వతీ దేవీ ! ఇదియే కాదు. ఆ శ్రీవైభవలక్ష్మి అనుగ్రహమును గుర్తింపక, తమకున్న సిరిసంపదలు తమవలన మాత్రమే వచ్చెనని అహంకరించినను ఆ తల్లి సహింపజాలదు. ఇందుకు ఉదాహరణగా నీకు మరొక కథ చెప్పెద వినుము.

ఒకానొక గ్రామమున శీల, సుశీల, గుణశీల, విశాల అను నలుగురు అక్కచెల్లెళ్ళు ఉండేవారు. వీరు శ్రీవైభవలక్ష్మీ దేవిని భక్తిశ్రద్ధలతో పూజించుచూ ఉండెడివారు. వారి సౌభాగ్య ప్రభావము వలన వారికి ధర్మనిష్ఠులు, సంపన్నులైన భర్తలు లభించెను. శీల భర్త శాస్త్రపాండిత్యము కలవాడు. సుశీల భర్త మంచి బాహుబలము కలవాడై మహారాజు వద్ద సైన్యాధికారము చేయుచుండెను. గుణశీల భర్తకు వర్తకము పట్ల మంచి అవగాహన ఉండెను. విశాల భర్త ఊరి ప్రజలకు ధర్మము బోధించుచూ తగు రీతిలో ఆర్థిక సహాయము చేయుచుండెను. కాలము గడువగా వారి భర్తలకు అహంకారము, దురాశలు, దుర్వ్యసనములు మొదలాయెను. వారు తమ వైభవము అంతా తమ ప్రతిభ వలననే వచ్చినది గానీ లక్ష్మీకటాక్షము కాదని వాదించుచూ దైవవిరుద్ధముగా ప్రవర్తించెడివారు. ఇందుకు కోపగించిన శ్రీమహాలక్ష్మి వారి సంపదలను వెనక్కి తీసుకోవడం ప్రారంభించెను. శీల భర్తకు పాండిత్య స్తబ్దత దాపురించి సభలలో అవమానములను పొంది క్రమముగా నిర్ధనుడాయెను. సుశీల భర్త బలగర్వముచే పురజనులతో కలహములు పెట్టుకొనుటచే మహారాజు అతనిని సైన్యాధికార పదవి నుండి తొలగించెను. గుణశీల భర్త వ్యాపారములో మోసము చేయుచూ దొరికిపోయి జరిమానా కింద తన సంపదను మొత్తం అప్పగించవలసి వచ్చినది. విశాల భర్త చెడు స్నేహములు, చెడు వ్యసనములకు అలవాటుపడి తన సంపదను పోగొట్టుకొనెను.

వారి భర్తల దుస్థితికి, తమ పేదరికానికి దుఃఖించుచున్న ఆ నలుగురు అక్కాచెల్లెళ్ళను చూసి శ్రీమహాలక్ష్మికి కనికరము కలిగి, అనుగ్రహింప తలచి, ఒక వృద్ధి స్త్రీ రూపములో వారి వద్దకు వచ్చెను. ఆమెను చూసిన అక్కాచెల్లెళ్ళు తమ బాధను చెప్పగా, ఆ వృద్ధి స్త్రీ “మీ వైభవము తిరిగిమీకు వచ్చుటకు మీరు శ్రీవైభవలక్ష్మీ వ్రతమును ఆచరించరింపుము. అ వ్రతవిధానమును చెప్పెద వినుము. వ్రతమును నాలుగు, తొమ్మిది, పదకొండు లేక ఇరవైవొక గురువారములు లేక శుక్రవారములు చేసి చివరి శుక్రవారమురోజున ఉద్యాపన చెప్పి కనీసము అయిదుగురు ముత్తైదువులకు వాయన తాంబూలములు ఇవ్వవలెను. వ్రతము సాయంత్రము సూర్యాస్తమయము తరువాత ఆరంభించవలెను. వ్రతము చేయురోజు ఉదయము కాలకృత్యములు తీర్చుకుని, స్నానము చేసి, ఇంటికి ఈశాన్యమును శుభ్రముచేసి, ఆవుపేడతో అలికి, ముగ్గులు పెట్టి, పూజా స్థానమును తయారు చేసుకోవలెను. సాయంకాలము వరకు ఉపవాసము ఉండి, ఈశాన్యమున కొత్త రవికలబట్ట పరచి దానిపై బియ్యము పోసి, దాని పై కలశమును పెట్టి, అందులో నీరుపోసి, తమ ఆర్థిక స్తోమతను బట్టి నాణెములను వేసి, ఫలవృక్షముల ఆకులువేసి, పైన ఒక కొబ్బరికాయ పెట్టి కలశ స్థాపన చేయవలెను. ఆ కలశము పై శ్రీవైభవలక్ష్మిని ఆవాహనము చేసి పూజ చేసి, తీపి పదార్థములు నివేదనముగా పెట్టవలెను. ఉద్యాపన చెప్పు రోజు పూజ అయిన తరువాత, ఆ కలశములోని నీటిని వేప, తులసి మొదలగు దైవవృక్షములలో పోయవలెను. ధనాపేక్ష కలిగిన వారు ఆ కలశములోని నీరును కొంచెము తీర్థమువలె స్వీకరించవలెను. అందులోని నాణెమును ఇంటిలో భద్రప్రచుకొనవలెను. కలశము క్రింది బియ్యముని పక్షులకు వేయవలెను.” అని వ్రతవిధానమును తెలిపి వెడలిపోయెను.

ఇది వినిన ఆ అక్కాచెల్లెళ్ళు ఆనందముగా తమ భర్తలతో కలసి శ్రీవైభవలక్ష్మీ వ్రతమును ఆచరించెను. ఆ వ్రత ప్రభావము వలన, శీల భర్త యొక్క పాండిత్యము తిరిగి గుర్తింపబడి గౌరవ మర్యాదలు కలిగినవి. సుశీల భర్త యొక్క బలమెరిగిన మహారాజు తిరిగి సైన్యాధికారమును ఇచ్చెను. గుణశీల యొక్క భర్త తిరిగి వ్యాపారమున ప్రతిభ కనబరచి సంపదను పొందెను. విశాల భర్త తన చెడు వ్యసనములను గుర్తించి మంచివాడిగా మారి, మరల పురప్రజలకు సన్నిహితుడాయెను.

కావున ఓ పార్వతీ దేవీ ! వైభవము, ఐశ్వర్యములు కలుగజేయు శ్రీవైభవలక్ష్మీని ఆరాధించుటవలన సిరిసంపదలు కలుగును” అని పరమేశ్వరుడు పలుకగా పార్వతీదేవి ఆనందముగా నమస్కరించినది.

క్షమాప్రార్థనా –
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్ ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి |
యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు తే ||

అనయా మయా కృతేన షోడశోపచార పూజయా భగవతీ సర్వాత్మికా శ్రీవైభవలక్ష్మీ దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు ||

తీర్థప్రసాద గ్రహణం –
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం ||
సమస్తపాపక్షయకరం శ్రీ మహాలక్ష్మీ పాదోదకం పావనం శుభం ||
శ్రీ శ్రీవైభవలక్ష్మ్యై నమః ప్రసాదం శిరసా గృహ్ణామి |

ఓం శాంతిః శాంతిః శాంతిః ||

sri vaibhava lakshmi vratham in telugu

శ్రీ వైభవ లక్ష్మీ వ్రతం తెలుగు

vaibhava lakshmi pooja vidhanam telugu

sri vaibhava lakshmi story in telugu

sri vaibhava lakshmi vratha katha telugu

vaibhava lakshmi vratha telugu pdf

sri vaibhava lakshmi telugu pooja

friday lakshmi pooja in telugu

sri vaibhava lakshmi vratham telugu book

sri vaibhava lakshmi telugu vratha vidhanam

sri vaibhava lakshmi telugu stotram

sri vaibhava lakshmi vratham procedure telugu

vaibhava lakshmi telugu vratam

telugu lakshmi vratham pooja details

sri vaibhava lakshmi vratha kalpam in telugu

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *